ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని స్వచ్ఛంద సంస్థలు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. రుద్రాక్షపల్లి పంచాయతీ బాసరగ్రామంలో అగ్నిప్రమాద బాధితులకు పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో రెండు లక్షల రూపాయలతో నిర్మించిన ఇళ్లకు ఎమ్మెల్యే సామూహిక గృహప్రవేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల సమన్వయకర్త చిత్తూరు ప్రసాద్‌ను అభినందించారు.
సేవలు అద్భుతం..
సాయం చేయాలంటే డబ్బు ఉండక్కరలేదని మంచి మనసుంటే చాలని ఎమ్మెల్యే వెంకట వీరయ్య అన్నారు. అది సత్తుపల్లి స్వచ్ఛంద సంస్థలకు పుష్కలంగా ఉందని పేర్కొన్నారు. బాకారం బాధితుల ఇళ్ల నిర్మాణం కోసం స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి అద్భుతమని ఎమ్మెల్యే కొనియాడారు. నూతన గృహ ప్రవేశం చేసిన బాధితులకు దుస్తులు, శానిటైజర్, మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హైమావతి, సర్పంచు చిలకమ్మ, ఎంపీడీవో సుభాషిని, రాఘవులు, హరికృష్ణ, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మరో తెరాస శాసన సభ్యుడికి కరోనా... గణేశ్ గుప్తాకు పాజిటివ్