ETV Bharat / state

ఇంటికే ముఖ్యమంత్రి సహాయ నిధి: ఎమ్మెల్యే సండ్ర

author img

By

Published : Jan 28, 2021, 7:20 PM IST

ముఖ్యమంత్రి సహాయ నిధి, బీమా పరిహార చెక్కులను నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి అందించే కార్యక్రమానికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో రూ.6.60 లక్షల విలువగల చెక్కులను పంపిణీ చేశారు.

sathupalli MLA Sandra launched the cm's relief Fund program at home in khammam
ఇంటికే ముఖ్యమంత్రి సహాయ నిధి: ఎమ్మెల్యే సండ్ర

ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో 6.60 లక్షల విలువగల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి అందజేశారు. తెరాస పార్టీ సభ్యత్వం ఉండి.. మృతి చెందిన మూడు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రెండు లక్షలు చొప్పున చెక్కులను ఇచ్చారు.

సత్తుపల్లి నియోజకవర్గంలో ఏడాది కాలంలో రూ.4.30 కోట్లను సీఎం సహాయనిధి నుంచి బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారని ఎమ్మెల్యే తెలిపారు. నిరుపేదలు వైద్య ఖర్చులతో ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే దృక్పథంతో.. ముఖ్యమంత్రి కేసీఆర్​ సహాయం అందిస్తున్నారని కొనియాడారు. రాజకీయాలకతీతంగా సీఎం సహాయ నిధి అందజేస్తున్నామని పేర్కొన్నారు.

తెరాస పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే.. వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో బీమా ప్రారంభించారని పేర్కొన్నారు. ఇలాంటి గొప్ప పథకాల గురించి ప్రజలకు అవగాహన అవసరమన్నారు.

ఇదీ చూడండి: బెంగళూర్​లో నిరంజన్​రెడ్డి.. ఐఐహెచ్ఆర్ సందర్శన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.