ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బందికి సైనిక ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ పిలుపు మేరకు వారిపై పూలవర్షం కురిపించారు. కరోనా కట్టడికి వారు చేస్తున్న కృషిని అభినందించారు. వైద్యులతో పాటు నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందిపై పూలు చల్లుతూ... సైనికులు సలాం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ, రైల్వే, పోలీస్ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై ఉద్యోగుల అభిప్రాయాలను ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు...
ఇదీ చూడండి: 'కరోనా వ్యాప్తి నియంత్రణలో భారత్ భేష్'