ETV Bharat / state

సాగర్ ప్రధాన​ కాలువకు గండి.. నీట మునిగిన వరి పొలాలు - Submerged paddy fields

Sagar canal water leakage in Khammam: రాష్ట్రంలో పడుతున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లి సమీపంలో సాగర్ ప్రధాన కాలువకు గండి పడింది. దీంతో ఆయకట్టు పరిధిలోని పొలాలు నీటిమునిగాయి. గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన జలవనరుల శాఖ సీఈ శంకర్​ నాయక్​ పది రోజుల్లో గండి పూర్తి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.

Sagar canal
Sagar canal
author img

By

Published : Oct 11, 2022, 10:35 PM IST

Sagar canal water leakage in Khammam: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లి సమీపంలో సాగర్ ప్రధాన కాలువకు భారీ గండి పడింది. దీంతో దీంతో ఆయకట్టు పరిధిలోని చాలా ఎకరాల పొలాలు నీటిమునిగాయి. మంగళవారం జలవనరుల శాఖ సీఈ శంకర్​ నాయక్​, ఎస్సీ ఆనంద్​ కుమార్​తో పాటు ఇతర శాఖ అధికారులు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రాజెక్టు నుంచి 82 కిలోమీటర్ల దూరం వద్ద గండి పడినట్లు గుర్తించారు. గండి పడిన ప్రాంతం వద్ద 20 మీటర్ల వరకు కోతకు గురైనట్లు సీఈ శంకర్​ నాయక్​ వివరించారు.

యుద్ధ ప్రాతిపదికన సాగర కాలువ గండికి మరమ్మతులు చేపట్టి వారం.. పది రోజుల్లో పూర్తి చేసి దిగువ ప్రాంతానికి నీళ్లు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. సాగర్​ కాలువకు గండి పడటంతో పెనుబల్లి మండలంలో 5000 ఎకరాలు, మూడో జోన్లో ఆంధ్రప్రదేశ్ చెందిన సుమారు 65 వేల ఎకరాలకు సాగునీరు నిలిచిపోయింది. త్వరితగతిన సాగర కాలవకు పడిన గండికి మరమ్మతులు చేపట్టి సాగునీరు అందించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

సాగర్ ప్రధాన​ కాలువకు గండి.. నీట మునిగిన వరి పొలాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.