ఖమ్మం జిల్లా కారేపల్లిలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా బలమైన గాలులు వీయగా రహదారుల పక్కన ఉన్న చెట్లు విరిగిపడ్డాయి. కారేపల్లి, గాంధీనగర్, పేరుపల్లిలో పలు చోట్ల రహదారికి అడ్డంగా చెట్లు పడ్డాయి. అకాల వర్షాలకు మామిడికాయలు నేలరాలాయి. ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడ్డారు.
ఇవీ చూడండి: మానవ మేధస్సుతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతోనే...