ETV Bharat / state

Rahul Gandhi telangana tour : రేపు తెలంగాణకు రాహుల్ గాంధీ.. కాంగ్రెస్​ 'జనగర్జన' సభకు హాజరు

Rahul Gandhi Meeting Khammam : ఖమ్మంలో నిర్వహించనున్న జనగర్జన బహిరంగ సభను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఆదివారం రోజున జరగనున్న ఈ సభకు రాహుల్‌ గాంధీ హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఈ సభకు.. భారీగా జనసమీకరణ లక్ష్యంగా హస్తం పార్టీ చర్యలు చేపట్టింది. మరో నాలుగైదు నెలల్లోనే ఎన్నికలు ఉన్నందున ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చేసి సత్తా చాటి.. వచ్చే ఎన్నికలకు శంఖారావం పూరించేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర అగ్రనాయకత్వమంతా ఖమ్మం బాట పట్టింది. సభ ఏర్పాట్లు, జనసమీకరణపై నాయకులు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

Rahul Gandhi
Rahul Gandhi
author img

By

Published : Jul 1, 2023, 11:36 AM IST

Updated : Jul 1, 2023, 11:43 AM IST

రేపే ఖమ్మంలో కాంగ్రెస్​ 'జనగర్జన' సభ.. ఏర్పాట్లు షురూ

Congress Public meeting in Khammam : ఖమ్మం వేదికగా ఆదివారం నిర్వహించే కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభకు ఆ పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీలో చేరికతోపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే బహిరంగ సభ విజయవంతానికి ముఖ్యనేతలంతా రంగంలోకి దిగారు. రాష్ట్ర పార్టీ నాయకత్వమంతా ఖమ్మంపై ప్రధాన దృష్టి సారించి సభ విజయవంతానికి నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తోంది.

Rahul Gandhi telangana tour : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించారు.బహిరంగ సభ కోఆర్డినేటర్​గా పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ జనసమీకణకు మల్లు రవి, ఒబెదుల్లా కొత్వాల్​ను నియమించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్లను నియమించారు. సమీప జిల్లాల నుంచి కార్యకర్తలను సమీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఆ సభను విజయవంతం చేసి.. కాంగ్రెస్ సత్తా చాటుతామని నేతలు అంటున్నారు.

Rahul Gandhi meeting in Khammam : ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ ఖమ్మంలో పర్యటించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జిలు, సమన్వయకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఖమ్మంలో నిర్వహించే కాంగ్రెస్ జన గర్జన సభ భారత్ రాష్ట్ర సమితికి రాజకీయ సమాధి కాబోతోందని రేవంత్‌రెడ్డి అన్నారు. వచ్చే డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి సోనియాకి కానుకగా ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

"ఆనాడు కేసీఆర్​ ఖమ్మంలో బహిరంగ సభపెట్టి బీఆర్​ఎస్​ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. ఆదివారం రోజున మేం ఖమ్మంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన జనం కంటే చాలా ఎక్కువ మంది వస్తారు. ఖమ్మంలో నిర్వహించే కాంగ్రెస్ జన గర్జన సభ బీఆర్​ఎస్​కి రాజకీయ సమాధి కాబోతోంది."- రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

Congress pubilc meeting at Khammam : ఖమ్మం బహిరంగ సభ విజయంతం చేసి.. వచ్చే ఎన్నికలకు ఇక్కడి నుంచే శంఖారావం పూరిస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. బహిరంగ సభ చరిత్ర సృష్టించబోతుందని జనగర్జన సభ కాంగ్రెస్ పునరేకీకరణ సభ కాదని.. తెలంగాణ పరిరక్షణ సభగా నేతలు అభివర్ణించారు. ఖమ్మం సభ నుంచే సాధారణ ఎన్నికలకు శంఖారావం పూరిస్తామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రానికి సభా ఏర్పాట్లు పూర్తి చేసేలా కాంగ్రెస్‌ నేతలు చర్యలు చేపట్టారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 1, 2023, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.