puvvada ajay kumar about Vaccination : ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం మన దేశంలోనే జరిగిందని రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాలో మొదటి డోసు వ్యాక్సినేషన్ వందశాతం పూర్తయిన సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గౌతమ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
వైద్యసిబ్బంది పాత్ర కీలకం
వైద్య సిబ్బంది కిందిస్థాయి కార్యకర్తల నుంచి ప్రతిఒక్కరు ఎంతో శ్రమించి జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసినందుకు వారిని అభినందించారు. రెండు డోసులు తీసుకోవడం వల్ల ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కూడా రక్షణ పొందవచ్చుననే నమ్మకం కలిగించాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ చూపిన వైద్యులకు సన్మానం చేశారు. డీఎంహెచ్‌వోతో కలిసి కేక్ కట్ చేశారు.
'నాకు తెలిసి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం మనదేశంలో జరిగింది. మనదేశ జనాభా దృష్ట్యా ఇది చాలా పెద్ద కార్యక్రమం. వందశాతం వ్యాక్సినేషన్ అని కొన్ని చిన్న దేశాలు చెబుతాయి. కానీ అక్కడ జనాభా చాలా తక్కువగా ఉంటుంది. మన బిగ్గెస్ట్ ఛాలెంజ్ పాపులేషన్. దాన్ని అధిగమించి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాం. ఇందులో పాల్గొన్న ప్రతీఒక్క వైద్య సిబ్బందిని అభినందిస్తున్నాం. ఇంతకన్నా పెద్ద సేవ వేరే ఉండదు.'
-మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఇదీ చదవండి: Rajanna Sircilla district Omicron Cases : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధరణ