ఖమ్మం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యవసాయ బిల్లును రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి జడ్పీ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.
కూడలి వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయాల వల్ల రైతుల నడ్డివిరిచే చర్యలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించారు. వ్యవసాయ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: పరువు హత్య: సినీ ఫక్కీలో అల్లుని హత్య... మామతో సహా 14 మంది కటకటాల్లోకి...