ETV Bharat / state

దడ పుట్టిస్తున్న విద్యుత్ హైటెన్షన్ లైన్లు.. పట్టించుకోని పాలకులు..! - విద్యుత్ హైటెన్షన్ లైన్లు

Electricity high tension lines Khammam: ఖమ్మం నగరంలో విద్యుత్ హైటెన్షన్ లైన్లు స్థానికులకు దడ పుట్టిస్తున్నాయి. ఇళ్ల మధ్య నుంచి వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ లైన్లు ప్రజల ప్రాణాలకు సంకటంగా మారాయి. ఎప్పుడు ఏ ఉపద్రవం పొంచి ఉందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాలనీల మధ్య ఉన్న హైటెన్షన్ లైన్లు తొలగించాలంటూ ఏళ్లుగా విన్నవిస్తున్నా... తమ గోడు ఎవరికీ పట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Electricity high tension lines Khammam
Electricity high tension lines Khammam
author img

By

Published : Feb 8, 2022, 2:00 AM IST

problem with Electricity high tension lines: ఖమ్మం జిల్లా కేంద్రం శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం నగర జనాభా 4 లక్షల 20 వేలకు చేరింది. ప్రస్తుతం నగరం నడిబొడ్డున ఉన్న ప్రాంతాల్లో చాలా కాలనీలు ఆవిర్భవించకముందే హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఉండేవి. నగరం క్రమంగా విస్తరించడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం విపరీతంగా పెరగడంతో భూములకు భారీగా డిమాండ్ పెరిగింది. ఆయా ప్రాంతాలన్నీ నగరంలో భాగమైపోవడం వల్ల భారీగా నిర్మాణాలు వెలిశాయి. నిబంధనల ప్రకారం హైటెన్షన్ విద్యుత్ లైన్లు వెళ్లిన చోట కానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ నివాస సముదాయాలు, నిర్మాణాలు చేపట్టకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ ఎవరికీ ఈ విషయం పట్టలేదు.

విచ్చలవిడిగా నిర్మాణాలు :

గతంలో ఖానాపురం హవేలీ పంచాయతీగా ఉన్న సమయంలోనూ, ఆ తర్వాత ఖమ్మం నగరపాలక సంస్థ (Khammam Municipal Corporation) పరిధిలోకి వచ్చిన తర్వాత భారీగా నిర్మాణాలు వెలిశాయి. అప్పట్లో విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో విచ్చలవిడిగా నిర్మాణాలు ఏర్పడ్డాయి. ఫలితంగా వారందరికీ ఇప్పటికీ కష్టాలు తప్పడం లేదు. ఖానాపురం హవేలీ ప్రాంతంలోని ఖానాపురం, ప్రశాంతినగర్, వేణుగోపాల్ నగర్-1, వేణుగోపాల్ నగర్-2, రాజీవ్ నగర్ గుట్ట, బాలాజీ నగర్, యూపీహెచ్ కాలనీ, కైకొండాయిగూడెం, పాండురంగాపురం, అమరావతినగర్, సంభానినగర్, ముస్తఫానగర్, అల్లీపురం రోడ్‌లోనూ ఈ తరహా విద్యుత్ లైన్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి.

భయం గుప్పిట్లో ..

భారీ విద్యుత్ ప్రవాహంతో ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్లు, 33/11 కేవీ విద్యుత్ తీగలు(electricity high tension wires) ఇళ్లపై నుంచి వెళ్తున్నాయి. భారీ వర్షాలు పడిన సమయాల్లో స్థానికులు భయం గుప్పిట్లో బతకాల్సి వస్తోంది. ఈ తీగల వల్ల ఇంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు ఎర్త్‌కు గురవున్నాని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన ప్రమాదాల్లో నలుగురు మృత్యువాతపడగా.. చాలామంది గాయాలపాలయ్యారని తెలిపారు. జనావాసాల మధ్య ఉన్న హైటెన్షన్ విద్యుత్ లైన్లు తొలగించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు, బల్దియా పాలకవర్గం, ప్రజాప్రతినిధులు తమ గోడు పట్టించుకుని హైటెన్షన్ విద్యుత్ లైన్లు మార్చాలని బాధిత కాలనీల వాసులు కోరుతున్నారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: Medaram Prasadam: ఈసారి ఇంటి వద్దకే మేడారం ప్రసాదం... డోర్​ డెలివరీకి ఏర్పాట్లు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.