తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఖమ్మం ధర్నాచౌక్ వద్ద ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ధర్నా నిర్వహించారు. తమకు ప్రభుత్వం నెలవారి భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థలు మూతపడడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రైవేటు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు గౌస్ ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యాసంస్థలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి అద్దె చెల్లించలేని స్థితిలో ఉన్నామని ఉపాధ్యాయులు వాపోయారు. ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పటి నుంచి వేతనాలు లేక ప్రైవేటు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఎంపీ సోయం బాపూరావుపై చర్యలు తీసుకోవాలి: జాతీయ బంజారా మిషన్