ETV Bharat / state

ఎందుకంటే.. కొవిడ్​ అంట: అంబులెన్సుల అడ్డగోలు దందా - private ambulances exploitation in corona pandemic time at khammam district

ఒకరి అవసరం మరొకరికి అవకాశంగా మారడం అంటే ఇదే మరి. కొవిడ్ మహమ్మారి సోకితే.. తాము ఉన్నచోట సరైన వైద్యం అందక.. మెరుగైన చికిత్సల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాలి. దానికి కచ్చితంగా అంబులెన్సు సౌకర్యం కావాల్సి రావడం.. బాధితుల కుటుంబాల పాలిట భారంగా మారుతోంది. సాధారణ సమయాల్లో ఉన్న అంబులెన్సుల ధరలకు ప్రస్తుతం కొవిడ్ పరిస్థితుల్లో ఉన్న అంబులెన్సుల ధరలకు ఏమాత్రం పొంతనే లేదు. ఏకంగా రెండు మూడు రెట్లు అదనంగా అంబులెన్సుల నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. అడ్డగోలుగా దందాలకు పాల్పడి బాధిత కుటుంబాలను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రైవేటు అంబులెన్సుల దందా ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది.

private ambulances exploitation in corona pandemic time
కరోనా సమయంలో ప్రైవేటు అంబులెన్సుల దందా
author img

By

Published : May 21, 2021, 1:21 PM IST

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రైవేటు అంబులెన్సుల దందా రోజురోజుకీ మితిమీరుతోంది. అసలే సాధారణ రోజుల్లో అంబులెన్సుల ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు, నిరుపేద రోగులకు శరాఘాతంగా మారుతుంటే.. ఇక కరోనా మహమ్మారి పుణ్యమా అని ప్రైవేటు అంబులెన్సుల నిర్వాహకులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. బాధితులను ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్సు నిర్వాహకులు విధిస్తున్న అధిక రుసుంలు బెంబేలెత్తిస్తున్నాయి.

ఖమ్మం జిల్లా మధిరకు చెందిన మహిళ మంచిర్యాలలో ఉద్యోగం చేస్తున్న కుమారుడి దగ్గరకి వెళ్లింది. వెళ్లిన మూడు నాలుగు రోజులకే ఆమె కరోనా బారిన పడింది. ఇక్కడైతే కుటుంబ సభ్యులు అంతా ఉంటారన్న ఉద్దేశంతో అక్కడి నుంచి ఖమ్మం తీసుకొచ్చేందుకు అంబులెన్సు మాట్లాడారు. మంచిర్యాల నుంచి ఖమ్మంకు బాధిత మహిళను తీసుకొచ్చేందుకు రూ.34000 అంబులెన్సు యాజమానికి చెల్లించారు. డ్రైవర్ బేటా అదనంగా మరో రూ.2000. ఆస్పత్రిలో వైద్యానికి అయిన ఖర్చులో సగం అంబులెన్సుకే ఖర్చు చేయాల్సి వచ్చిందని బాధితురాలి కుటుంబం వాపోయింది.

రఘునాథపాలెం మండలానికి చెందిన గర్భిణీకి నొప్పులు రావడంతో ఈ నెల 9న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొవిడ్ పాజిటివ్ ఉండటంతో వరంగల్​లోని ఆస్పత్రికి వెంటనే తరలించాలని ఆస్పత్రి వైద్యులు సూచించారు. ఆస్పత్రి బయట ఉన్న అంబులెన్సు నిర్వాహకుడిని సంప్రదించారు. వరంగల్ తీసుకెళ్లేందుకు రూ.25 వేలు అవుతుందని చెప్పారు. అంబులెన్సు ధర చూసి బాధితురాలి కుటుంబీకులు నివ్వెరపోయారు. ఆర్థిక స్తోమత లేదని వేడుకున్నా తగ్గించేది లేదని తెగేసి చెప్పారు. చివరకు గ్రామానికి చెందిన నాయకులు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి విషయం తీసుకెళ్లడంతో ఆయన కార్యాలయం స్పందించింది. కార్యాలయ ఇన్​ఛార్జి దయాకర్ రెడ్డి గర్భిణీ కోసం ప్రత్యేక అంబులెన్సు సదుపాయం కల్పించి వరంగల్ పంపారు.

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలానికి చెందిన ఓ 55 ఏళ్ల వ్యక్తి కరోనా బారినపడ్డారు. నాలుగు రోజులు సూర్యాపేటలో చికిత్స పొందిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఐదురోజుల తర్వాత చికిత్స పొందుతూ బాధితుడు మృతిచెందాడు. కుటుంబసభ్యులు, బంధువుల కడసారి చూపుల కోసం తీసుకెళ్దామని అంబులెన్సు మాట్లాడుకున్నారు. కేవలం ఖమ్మం నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి తీసుకెళ్లేందుకు రూ.18 వేలు ఇవ్వాల్సిందేనని అంబులెన్సు యజమాని తెగేసి చెప్పాడు. చేసేదేమీ లేక అంగీకరించారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత కొన్ని కిలోమీటర్లు ఎక్కువ రావాల్సి వచ్చిందని మరో రూ.2 వేలు అదనంగా వసూలు చేశాడు. వీటితోపాటు బేటా రూపంలో డ్రైవర్ అదనంగా మరో రూ.1000 పిండుకున్నాడు.

కాసుల కక్కుర్తి

సిండికేట్​గా మారుతున్న ప్రైవేటు అంబులెన్సుల నిర్వాహకులు.. వాళ్లు చెప్పిన ధరలే వేదంగా వసూళ్లు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. అసలు ఏ ఒక్కరూ అంబులెన్సు సౌకర్యం కల్పించకుండా మొండికేస్తున్నారు. ఎందుకీ బాదుదంటే కరోనా సాకు చెబుతూ సామాన్య, మధ్యతరగతి వారి నుంచి భారీగా దోచేస్తున్నారు. బాధితులు, వారి కుటుంబీకుల అవసరాన్ని అవకాశంగా మలుచుకుంటూ రూ. వేలల్లో పిండుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగం, పర్యవేక్షించాల్సన వైద్యశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రైవేటు అంబులెన్సుల దందా ఇష్టారాజ్యంగా సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కరోనా పేరుతో

ఖమ్మం జిల్లాలో 170 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 37 అంబులెన్సులు ఉన్నాయి. వీటిలో జిల్లా కేంద్రాలైన ఖమ్మం, కొత్తగూడెంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఖమ్మంలో దాదాపు 150 వరకు ఉండగా.. కొత్తగూడెంలో 18 ప్రైవేటు అంబులెన్సులు ఉన్నాయి. సాధారణ రోజుల్లోనే ప్రైవేటు అంబులెన్సుల నిర్వహణ అంతా ఇష్టారాజ్యంగా సాగేది. ప్రస్తుతం కొవిడ్ సమయంలో అంబులెన్సు నిర్వాహకుల ఆగడాలకు ఏమాత్రం అద్దూ అదుపూ లేకుండా పోతోంది. ఎందుకీ బాదుడంటే కొవిడ్ పేరు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో కొత్తగూడెం నుంచో, ఖమ్మం నుంచో గరిష్ఠంగా రూ.10 వేల నుంచి 12 వేల వరకు ఉన్న అంబులెన్సు ధర ఇప్పుడు ఏకంగా రూ.30 వేలు వసూలు చేస్తున్నారు.

కొవిడ్ పేరిట అడ్డగోలు దందా

గతంలో కిలోమీటర్ లెక్కన ధరలు ఉండేవి. ఇప్పుడు జిల్లాలో ప్రాంతాలను బట్టి ధరలు, జిల్లా సరిహద్దు ప్రాంతాలైతే మరో రేటు, ఇతర జిల్లాలకైతే మరో రేటు అన్నట్లు ధరలు నిర్ణయించి దోపిడీ చేస్తున్నారు. బేటా రూపంలో డ్రైవర్ మరికొంత పిండుకుంటున్నాడు. ఇక రాత్రివేళల్లో అయితే.. అంబులెన్సు నిర్వాహకుల నోటికే మొక్కాలి. వారు ఎంత చెబితే అంత చెల్లించాల్సిందే.

కనిపించని నియంత్రణ

ప్రైవేటు అంబులెన్సులపై అధికార యంత్రాంగం పర్యవేక్షణ లేకపోవడం, నిర్వాహకుల ఆగడాలను నియంత్రించకపోవడం వల్లనే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి. అంబులెన్సుల నిర్వాహకులు కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా అధిక ధరలు వసూలు చేస్తున్నా పట్టించుకున్నావారే కరవయ్యారు. అంతేకాదు.. అంబులెన్సుల నిర్వాహకులు నిబంధనలు గాలికొదిలేస్తున్నారు. ప్రైవేటు అంబులెన్సులకు లైసెన్సులు ఉండాలంటే ఏదో ఒక ఆస్పత్రికి అనుసంధానంగా నమోదు కావాలి. అంబులెన్సు నడిపేవారు అనుభవం కలిగి ఉండాలి. ప్రాథమిక చికిత్స చేయగలగాలి. రోగికి అత్యవసర పరిస్థితి తలెత్తితే.. ఆస్పత్రికి వెళ్లే వరకు ప్రాణాపాయం లేకుండా చూడగలిగే సమర్థత ఉండాలి. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లే సమయంలో అదనపు ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాలి. కానీ.. ఈ నిబంధనలన్నీ ఎక్కడా కనిపించడం లేదు.

ఆక్సిజన్​తో వ్యాపారం

ప్రైవేటు అంబులెన్సులకు సిలిండర్లు ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇష్టారాజ్యంగా సిలిండర్లు వినియోగించే అవకాశం లేదు. ఫలితంగా బ్లాక్ మార్కెట్​లో తీసుకొచ్చామంటూ అధిక ధరలు రోగి కుటుంబీకులపైనే మోపుతున్నారు. కొన్ని అంబులెన్సుల్లో అదనపు సిలిండర్లు ఉండకపోవడం వల్ల మార్గమధ్యలోనే రోగులు చనిపోయిన సందర్భాలూ ఉమ్మడి జిల్లాలో చోటుచేసుకున్నాయి. ఇక ఏ ప్రైవేటు ఆస్పత్రి పేరిట నమోదైతే అక్కడే అంబులెన్సు ఉంచాలి, కానీ.. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద అడ్డాలు పెడుతున్నారు. అసోసియేషన్లు ఏర్పాటు చేసి, సిండికేట్​గా మారి ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తున్నారు. కొన్నిసార్లు రోగి బంధువులు వెళ్లాలనుకున్న ఆస్పత్రులకు కాకుండా మరో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఆస్పత్రులతో ముందే కమిషన్లు మాట్లాడుకుని రోగులను తరలిస్తున్నారు.

ప్రస్తుతం కొవిడ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్నివిధాలా ప్రయత్నం చేస్తున్న వైద్యారోగ్య శాఖ.. అంబులెన్సుల నిర్వహణపైనా పర్యవేక్షణ చేపట్టాలి. ప్రైవేటు ఆస్పత్రులపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కానీ ప్రైవేటు అంబులెన్సులపై ఏమాత్రం పర్యవేక్షణ లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, వైద్యారోగ్య శాఖ పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తేనే ప్రైవేటు అంబులెన్సుల దోపిడీకి కొద్దిమాత్రమైనా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: కరోనా కరాళ నృత్యం.. పర్యవేక్షణపై ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.