పొంగులేటి ఇంటి ముందు బైఠాయించిన అభిమానులు
అభిమానులను ఓదార్చి... కంటతడి పెట్టిన పొంగులేటి - mp
పొంగులేటికి టికెట్ రాకపోవడంపై కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన ఇంటి ముందు బైఠాయించి పోటీ చేయాలంటూ నినాదాలు చేశారు. వాళ్లను ఓదార్చుతూ... ఎంపీ కన్నీళ్లు పెట్టుకున్నారు.

పొంగులేటి ఇంటి ముందు బైఠాయించిన అభిమానులు
పొంగులేటి ఇంటి ముందు బైఠాయించిన అభిమానులు
ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ నిరాకరించటంపై కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. ఖమ్మం వచ్చిన పొంగులేటిని కలిసేందుకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఇంటి ముదు బైఠాయించి పోటీ చేయాలంటూ నినాదాలు చేశారు. కొంత మంది కార్యకర్తలు ఆయనపై పడి బోరున విలపించారు. ఒక్కోక్కరిని ఎంపీ ఓదార్చారు. పొంగులేటి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
sample description