ETV Bharat / state

యువకుడి నిర్లక్ష్య బౌలింగ్​కు పోలీసు లాఠీ సిక్స్​ - యువకుడిని కొట్టిన పోలీసు

కరోనాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్​ విధించింది. బయటకు ఎవరూ రాకుండా ఉండేందుకు పోలీసులు కలియ తిరుగుతున్నారు. అయినా కొందరూ అవేవి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలా సామాజిక బాధ్యతలేని ఓ యువకుడికి ఓ పోలీసు ఎలా బుద్ధి చెప్పాడో చూడండి.

యువకుడి నిర్లక్ష్య బౌలింగ్​కు పోలీసు లాఠీ సిక్స్​

author img

By

Published : Mar 27, 2020, 2:00 PM IST

బయటకు రావొద్దని దండం పెట్టారు. గుంపులుగా గుమిగూడొద్దని ప్రాధేయపడ్డారు. పగలనకా.. రాత్రనకా.. ఊరురా తిరుగుతూ బతిమిలాడారు. చిన్న పిల్లలను బుజ్జగిజ్జినట్లు మెత్తగా చెప్పారు పోలీసులు. అయినా ఆ మాటలు పెడచెవిన పెట్టి ఇష్టార్యాజ్యంగా తిరుగుతున్నారు కొందరు. ఇలా నిర్లక్ష్యంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారంలో కొంతమంది యువత క్రికెట్​ ఆడారు.

యువకుడి నిర్లక్ష్య బౌలింగ్​కు పోలీసు లాఠీ సిక్స్​

అది తెలుసుకున్న పోలీసులు క్రికెట్​ ఆడుతున్న మైదానానికి వెళ్లి తమ లాఠీ ఝళిపించారు. పాఠశాలలో మాష్టారు అడిగిన పాఠం అప్పజెప్పని విద్యార్థిని కొట్టినట్లుగా బుద్ధి చెప్పాడో ఓ పోలీసు. ఆ దెబ్బలకు చిన్నప్పటి కూడా గుర్తొచ్చి ఉంటాయి. తన తప్పు తెలుసుకొని ఇంకోసారి అలా బయటకు రానని.. ఇంట్లోనే ఉంటానని చెప్పి పరుగు పెట్టాడు.

ఇదీ చూడండి: నిబంధన అతిక్రమిస్తే చలానా ఇంటికొస్తుంది: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.