ఖమ్మం జిల్లా ఏనుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ జాతీయ నాణ్యత ప్రమాణాల పరిశీలన రాష్ట్ర సమన్వయ కర్త డాక్టర్ జోత్స్న తనిఖీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెలలో కేంద్ర కమిటీ బృందం పర్యటించబోతోంది. ముందస్తుగా ఆమె ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలో పెద్దగోపతి, తిరుమలాయపాలెం, వైరా, ఏనుకూరు, చింతకాని ఆసుపత్రుల్లో నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో విభాగాల వారీగా రోగులకు కల్పిస్తున్న వస్తువులు, ఉపకేంద్రాల్లో సౌకర్యాలు, రికార్డుల నిర్వహణ, హరితహారం, స్వచ్ఛభారత్ వంటి వాటిని పరిశీలించారు. జిల్లా వైద్య అధికారితో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు .
ఇవీ చూడండి: కొత్త పంచాయతీ... కొత్త కార్యదర్శులు