ETV Bharat / state

వెలుగులోకి మరో పెట్రోల్​ బంకు మోసం - ఖమ్మం జిల్లా వైరా

ఓ మహిళ డీజిల్​ కోసం పెట్రోల్​ బంకుకు వెళ్లింది. వెయ్యి రుపాయల పెట్రోల్​ కొట్టిస్తే.. మీటర్​ తీరుగుతున్నప్పటికీ డీజిల్​ రావడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. గమనించిన స్థానికులు ప్రశ్నించి పౌరసరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.

petrol bunk to another cheating in diesel reading issue at wyra khammam
వెలుగులోకి మరో పెట్రోల్​ బంకు మోసం
author img

By

Published : Mar 11, 2021, 7:59 PM IST

వెలుగులోకి మరో పెట్రోల్​ బంకు మోసం

ఖమ్మం జిల్లా వైరా పాత బస్టాండ్ సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో వినియోగదారులను మోసగిస్తున్న వైనం బయట పడింది. రీడింగ్ తిరుగుతున్నప్పటికీ డీజిల్ రాకపోవడంతో.. పలువురు వినియోగదారులు గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సతీమణి నందిని తన కారుకు డీజిల్ కోసం బంకుకి వెళ్లారు. వెయ్యి రుపాయల డీజిల్ కొట్టినప్పటికీ.. కారులో మీటరు చూపించక పోవడంతో ఆమె ప్రశ్నించారు.

ఆ తర్వాత కొందరు వినియోగదారులు ప్రశ్నించి.. రీడింగ్ తిరుగుతున్నా డీజిల్ రాకపోవడం పరిశీలించారు. వెంటనే పౌరసరఫరాల శాఖ అధికారులకు చరవాణి ద్వారా ఫిర్యాదు చేశారు. స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెట్రోల్ భారం మోపుతుండగా... బంకు యజమానులు ఇలా వినియోగదారులను మోసం చేయడంపై స్థానికులు మండి పడ్డారు.

ఇదీ చూడండి : డ్రైవర్‌ తాగి ఉన్నాడని తెలిసీ వాహనంలో ప్రయాణిస్తే కేసు తప్పదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.