ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం శివయ్య గూడెంలో 2009లో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేయడం వల్ల లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ పట్టాలు ఎలా రద్దు చేస్తారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టా కాగితాలతో ధర్నా చేశారు. తహసీల్దార్ సమాధానంతో సంతృప్తి చెందని ఆందోళనకారులు ఖమ్మం-ఇల్లందు రహదారిని దిగ్బంధించారు.
రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో గంటపాటు రహదారిపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. తమ భూములు తమకు ఇవ్వాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు.
Body:ఇళ్ల స్థలాల కోసం ఆందోళన
ఇవీ చూడండి:'ఈటీవీ'కి మహేశ్ రజతోత్సవ శుభాకాంక్షలు