ETV Bharat / state

ప్రజల ఇక్కట్లను.. ఈ వరుసే చెప్పును.!

author img

By

Published : May 8, 2021, 9:37 AM IST

రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఆందోళనకు గురవుతోన్న ప్రజలు చిన్న అనారోగ్యం వచ్చినా అది కొవిడ్ కావచ్చునని భయపడుతున్నారు. కరోనా పరీక్షల కోసం పరుగులు తీస్తున్నారు. తాజాగా ఖమ్మం పట్టణంలోని పాత బస్టాండ్ ఆవరణలో నిర్వహిస్తోన్న నిర్థరణ కేంద్రానికి ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మరి కొంతమంది ఎక్కువసేపు నిల్చోలేక తమ చెప్పులను వరుసలో పెట్టి పక్కన కూర్చున్నారు.

corona tests in khammam
ఖమ్మంలో కరోనా పరీక్షలు

కరోనా పరీక్షల కోసం వచ్చిన వారితో ఖమ్మం పాత బస్టాండు నిర్ధారణ కేంద్రం శుక్రవారం కిటకిటలాడింది. వైరస్‌ లక్షణాలతో వందలాది మంది తెల్లవారుజామునే వచ్చి గంటలకొద్ది వరుసల్లో నిరీక్షించి ఇబ్బందుల పాలయ్యారు. కొందరు ఎక్కువ సేపు నిలబడలేక చెప్పులను వరుసలో పెట్టి పక్కన కూర్చున్నారు.

టోకెన్లు, ఓపీ, పరీక్షలు.. ఇలా మూడు విభాగాల్లో జనం వరుసలు కట్టాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చిన వారెవరూ భౌతిక దూరం పాటించకపోవడంతో పోలీసులు లాఠీలు అడ్డుపెట్టి వారిని నిలువరించారు.

ఇదీ చదవండి: కొలువుదీరిన పురపాలక నూతన పాలకవర్గాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.