ప్రత్యేక రాష్ట్రావతరణ అనంతరం నిరుద్యోగులకు అనేక ఉద్యోగావకాశాలు కల్పించామని... పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో.. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా తాగు, సాగు నీటి సమస్యలు పరిష్కరించామని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి, కృష్ణా నీటితో సశ్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు సరిగా రావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, తెరాస రాష్ట్ర కార్యదర్శి తాతమధు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మహిళ ప్రాణాలు కాపాడిన గొలివాడ ప్రసన్న కుమార్ బెస్త టీం