రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వనజీవి రామయ్య ఖమ్మం నగర పాలక కార్యాలయం ఎదుట తన ద్విచక్రవాహనంపై నుంచి కిందపడి పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య గాయపడ్డారు. ముందు నుంచి వేగంగా వస్తున్న బండిని తప్పించబోయి సడెన్ బ్రేక్ వేయగా కిందపడినట్లు రామయ్య భార్య తెలిపారు. ఎడమ చేయి, ఛాతిపై దెబ్బలు తగిలాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో రామయ్య చికిత్స పొందుతున్నారు.ఇవీ చదవండి:'మిషన్ శక్తిపై కేంద్రం ప్రకటన అవివేక చర్య'