ETV Bharat / state

జట్టీలో భార్య శవాన్ని మోసుకెళ్తూ... - భార్య శవం

దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నా...పల్లెల్లో మాత్రం శవాల తరలింపునకు సరిపోయే డబ్బులేక అవస్థలు పడుతున్నారు ప్రజలు. డబ్బులు లేక 11 కి.మీలు భార్య మృతదేహాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.

జట్టీలో భార్య శవాన్ని మోసుకెళ్తూ...
author img

By

Published : Mar 19, 2019, 12:09 PM IST

జట్టీలో భార్య శవాన్ని మోసుకెళ్తూ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో హృదయ విదారక ఘటన జరిగింది. క్రాంతిపురానికి చెందిన గ్రామస్థులు మిరప కోతల పనులకు వెళ్లారు. అక్కడే తాత్కాలిక గుడారాలు వేసుకొని ఉంటున్నారు. లింగయ్య జ్యోతి దంపతులు కూడా మిరప కోతలకు వెళ్లారు. భార్యా భర్తల మధ్య గొడవ రావడంతో భార్య జ్యోతి పురుగుల మందు తాగింది.

108 వాహనంలో భద్రాచలం తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. మృతదేహాన్ని అదే వాహనంలో తీసుకొచ్చి చర్ల ప్రభుత్వాసుపత్రిలో వదిలేశారు. అక్కడి నుంచి పోస్టుమార్టం గదికి రిక్షాలో తరలించారు. శవపరీక్షల అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యుల దగ్గర డబ్బులు లేవు. చేసేదేమీ లేక 11 కిలో మీటర్ల దూరంలో ఉన్న క్రాంతిపురానికి కుటుంబసభ్యులు జట్టీలో తీసుకెళ్లేందుకు ఉపక్రమించారు. అలా తీసుకెళ్తుండగా చర్లలోని గాంధీ నగర్‌ సెంటర్‌ వద్ద ఈ హృదయ విదారక ఘటనను ఎస్సై రాజు వర్మ చూసి చలించిపోయారు. మృతదేహాన్ని ఆటోలో తరలించేందుకు సాయం చేశారు.

ఇవీ చదవండి:'తొలగించడం అసంభవం..!'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.