ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట, నాగవరప్పాడు గ్రామాల సమీపంలోని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాలువ పరిధిలోని నిదానపురం మేజర్‌గా పిలిచే ఎన్నెస్పీ కాలువకు గండి పడింది. గత నాలుగు రోజులుగా విరామం లేకుండా కురిసిన వర్షాలతో పాటు.. కాలువకు గండి పడడం వల్ల వచ్చిన వరద నీటి ప్రవాహం వల్ల పంట పొలాలు నీట మునిగాయి.
వరద నీరు, కాలువ నీటిలో మునిగి దాదాపు 50 నుంచి 100 ఎకరాల పంట నీటిలో మునిగినట్టు అధికారులు తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. నీట మునిగిందని.. అధికారులు స్పందించి ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ఎన్నెస్పీ కాలువ గండి పూడ్చాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు