ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన తెరాస నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రాములునాయక్ కేక్ కట్ చేశారు. మిఠాయిలు పంపింణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ సంఘాల క్యాలెండర్లు ఆవిష్కరించారు. కొత్త వసంతలో నియోజకవర్గ అభివృద్దికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని, ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ ఫలాలు ప్రజలకు అందే విధంగా చొరవ చూపాలని కోరారు.
ఇవీ చూడండి: యాదాద్రిలో పొటెత్తిన భక్తజనం