ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రి క్షేత్రంలోని శివాలయం మహా శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి పీవీ రమణ తెలిపారు.
ఇదీ చూడండి: గ్రామాల్లో, తండాల్లో మంత్రి సత్యవతి రాఠోడ్ పల్లెనిద్ర