ETV Bharat / state

Nama Nageswara Rao: మధుకాన్‌పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు..

ఎన్ని ఇబ్బందులు వచ్చినా కేసీఆర్ వెంటే ఉంటానని ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. కేసీఆర్, ఖమ్మం జిల్లా ప్రజలే తన బలమన్నారు. మధుకాన్‌పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు.

Nama Nageswara Rao
Nama Nageswara Rao
author img

By

Published : Jun 19, 2021, 1:01 PM IST

Updated : Jun 19, 2021, 2:27 PM IST

Nama Nageswara Rao: మధుకాన్‌పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు..

కేసీఆర్, ఖమ్మం జిల్లా ప్రజలే తన బలమని ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కేసీఆర్ వెంటే ఉంటానని వెల్లడించారు. గత 20 ఏళ్ల నుంచి ప్రజా జీవితంలో ఉంటున్నట్లు గుర్తు చేశారు. 40 ఏళ్ల క్రితం మధుకాన్‌ను స్థాపించినట్లు స్పష్టం చేశారు. ఎంతో శ్రమించి మధుకాన్‌ను విస్తరించినట్లు వివరించారు.

మధుకాన్ ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టిందని వెల్లడించారు. దేశ సరిహద్దుల్లో క్లిష్టతర ప్రాంతాల్లో రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. చైనా సరిహద్దులో కూడా రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మధుకాన్‌పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రాంచీ హైవే నిర్మాణం జాతీయరహదారుల నిర్మాణ సంస్థ జాప్యం వల్లే ఆగిపోయిందని స్పష్టం చేశారు. ఇటీవల ఈడీ అధికారుల జరిపిన సోదాలపై నామ స్పందించారు. ఎవరూ ఫిర్యాదు చేయకుండానే తనిఖీలు చేశారని ఆయన వివరించారు. 60 శాతం పనులు పూర్తయినా... ప్రాజెక్టు రద్దుచేశారని నామ నాగేశ్వరరావు ఆరోపించారు. మొత్తం వ్యవహారం ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ కింద ఉన్నందున ఇంతకన్నా ఎక్కువ చెప్పలేనని తెలిపారు. ట్రిబ్యునల్‌లో కంపెనీకి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించిన నామ నాగేశ్వరరావు విచారణకు అన్ని విధాలా సహకరిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: బీజకోశ క్యాన్సర్ – త్వరిత నిర్ధరణే సగం చికిత్స

Last Updated : Jun 19, 2021, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.