ETV Bharat / state

కరవు మండలాల్లో జల సవ్వడులు.. రైతు మోమును చిరునవ్వులు

author img

By

Published : Jul 23, 2020, 7:54 AM IST

ఖమ్మం జిల్లాలో ఆ మండలాలు కరవు ప్రాంతాలుగా రికార్డులకెక్కాయి. తలాపున మున్నేరు ఉన్నా ఒక ఎకరం పంట పండాలంటే కష్టంగా ఉండేది. వర్షాకాలంలో వరద పోటెత్తినా ఒక్క చుక్క ఆగకుండా దిగువకు వెళ్లిపోయేది. ప్రస్తుతం ఎక్కడికక్కడ చెక్‌డ్యాంలు కట్టడం వల్ల మున్నేరు నిండకుండను తలపిస్తోంది. రెండు పంటలు పండించుకోవచ్చని ఆయకట్ట రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

munneru vaagu full water with check dams
చెక్ ​డ్యాంలతో అడ్డుకట్టలు.. నిండుకుండలా మున్నేరు

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం గ్రామీణ, తిరుమలయపాలెం మండలాలు జిల్లాలోనే అత్యంత కరువు ప్రాంతాలుగా పేరొందాయి. ఖమ్మం గ్రామీణ మండలంలో ఉన్న మున్నేరు నదికి ఏటా వరద పోటెత్తుతుంది. ఎన్నో ఎళ్లుగా వరద వస్తున్నా... స్థానికంగా రైతులకు నిరాశే మిగిలేది.

ఒక్క చుక్క కూడా ఆగకుండా దిగువకు వెళ్లి కీసర వద్ద కృష్ణానదిలో కలిసేది. రాష్ట్రం ఏర్పడ్డాక... మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. మున్నేరు నదిపై రెండు చెక్‌డ్యాంలు, వంతెనల నిర్మాణం చేపట్టారు.

సుమారు రూ. 26 కోట్లతో చేపట్టిన పనులు ఇటీవల పూర్తయ్యాయి. ప్రస్తుతం చెక్‌ డ్యాంల వద్ద నీరు నిలిచి నిండుకుండను తలపిస్తున్నాయి. ప్రస్తుతం పరిసర ప్రాంతాల్లోని సుమారు పది గ్రామాలకు సాగునీరు బెడద తీరింది. సుమారు 5వేల ఎకరాల్లో రెండు పంటలకు సరిపడ నీరు అందుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మున్నేరు నదిపై గొల్లపాడు గ్రామం వద్ద కాకతీయుల కాలంలో కట్టిన అనకట్ట ఉంది. గతంలో ఈ ఆనకట్ట ద్వారా సుమారు 3వేల ఎకరాలు సాగు చేసేవారు. ఖమ్మం నగరానికి కాలువ ద్వారా నీటిని అందించేవారు.

సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురై... కట్టకు బుంగలు పడి చుక్క నీరు నిలిచే పరిస్థితి ఉండేది కాదు. చాలా వరకు కొట్టుకుపోయింది. మున్నేరుకు వచ్చిన నీరు వచ్చినట్లుగా ఖాళీ అయ్యేది.

మిషన్‌ కాకతీయ పథకం కింద రూ. 5 కోట్లతో మరమ్మతులు చేశారు. రేండుళ్లుగా నీరుకు అడ్డుకట్ట పడి... నిండుకుండలా మారింది. సుమారు 1500 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది.

రఘునాథపాలెం మండలంలో వానాకాలం ఉద్ధృతంగా ప్రవహించే వాగులు... ఆ తర్వాత ఇసుక మేటలు వేసి డొంక రహదారులుగా కనిపించేవి. ప్రస్తుతం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చొరవతో ఐకే బంజర వద్ద నిమ్మవాగుపై కోటీ 40లక్షల వ్యయంతో చెక్‌డ్యాం నిర్మించారు.

కొద్ది రోజుల క్రితం నిర్మాణం పూర్తిచేసుకున్న డ్యాం వల్ల సమీపంలోని వాగుల్లో కిలోమీటర్‌ మేర నీరు నిలిచింది. ప్రస్తుతం సాగుకు జలాలు అందుతున్నాయని రైతులు పేర్కొన్నారు. ఒక్క పంటకే నీరు సరిపోక బోర్లు వేసుకుని నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి నుంచి... ప్రస్తుతం రెండు పంటలు వేసుకునే అవకాశం కలిగిందని రైతులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,554 కరోనా కేసులు.. 9 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.