గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, వారి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, నకిలీ ఏజెంట్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని వలసదారుల హక్కులు, సంక్షేమ ఫోరమ్ (మైగ్రెంట్ రైట్స్, వెల్‌ఫేర్ ఫోరమ్).. విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెరాస లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావును ఆయన నివాసంలో ఫోరమ్ సభ్యులు కలిశారు. గల్ఫ్ కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, పార్లమెంటులో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని నామా హామీ ఇచ్చారు.
గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, అక్కడ నుంచి తిరిగి వచ్చిన వారికి ఇక్కడ ఉపాధి, పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకుంటామని నామా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షులు కోటపాటి నర్సింహనాయుడు, అధ్యక్షుడు రమేష్ ఏముల తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'డీపీఆర్‌లు ఎందుకివ్వరు?.. ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నారు'