ETV Bharat / state

Monsoon delayed in Telangana : చినుకమ్మా.. వాన చినుకమ్మా.. తొలకరి చినుకుల జాడ ఏదమ్మా.. - Farmers Facing Problems due to monsoon Late

Monsoon in Telangana 2023 : వానాకాలం సీజన్ ప్రారంభమై దాదాపు 20 రోజులు గడుస్తున్నా.. చినుకు జాడ లేక అన్నదాతల్లో కలవరం మొదలవుతోంది. ఏరువాక పౌర్ణమి దాటినా.. మృగశిర కార్తె నడుస్తున్నా తొలకరి జాడ లేక రైతులు సాగు పనులు మొదలుపెట్టక వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. అరేబియా సముద్రంలో తుపాను కారణంగా నైరుతి రుతుపవనాలు మందకొడిగా కదులుతున్నాయని వాతావారణ శాఖ అంచనా వేస్తోంది. జూన్ చివరి వారం వస్తున్నా ఇంకా వేసవి తాపం, వడగాలుల తీవ్రత తగ్గక కర్షకుడు మబ్బువైపు చూడాల్సిన దుస్థితి నెలకొంది.

Monsoon delayed in Telangana
Monsoon delayed in Telangana
author img

By

Published : Jun 18, 2023, 7:43 AM IST

Updated : Jun 18, 2023, 7:59 AM IST

రాష్ట్రంలో తొలకరి చినుకులు పడనందున రైతుల కష్టాలు

Farmers Facing Problems due to monsoon Late : జూన్‌ పూర్తి కావస్తున్నా.. గరిష్ఠ ఉష్ణోగ్రతలే నమోదవుతుండటంతో సాగుకు సన్నద్ధమవుతున్న కర్షకులకు నిరీక్షణ తప్పడం లేదు. ఏటా ఈ సమయానికి తొలకరి వర్షాలు పడి రైతులు దుక్కులు దున్నుకునే వారు. ఈసారి రుతుపవనాలే ప్రవేశించకపోవడంతో సకాలంలో వర్షాలు కురుస్తాయా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలు, ప్రకృతి విపత్తుల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం ఈసారి సీజన్ ముందస్తు సాగు చేపట్టాలని భావించింది. ఇప్పటి వరకు ఆశించిన మేర వానలు లేక అన్నదాతలు సాగు కోసం నిరీక్షిస్తున్నారు. రుతు పవనాలు రాష్ట్రమంతా విస్తరించడానికి మరికొంత సమయం పడుతుందన్న వాతావరణ శాఖ అంచనాలు.. రైతులకు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

Monsoon in Khammam Delayed : ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో దాదాపు 12 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సాగుకు సన్నద్ధమయ్యేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నప్పటికీ వరుణుడి పలకరింపు లేక సీజన్ ఆలస్యమవుతోంది. ఇప్పటికే పంటల సాగు కోసం రైతులు దుక్కులు సిద్ధం చేసుకున్నారు. వరుణుడు కరుణిస్తే.. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యేందుకు ఎదురుచూస్తున్నారు.

Monsoon in Telangana Delayed : తొలకరి కోసం రైతుల ఎదురుచూపులు

Farmers Facing Issues due to Rains Delay : బ్యాంకులు ఇంకా రుణ ప్రణాళిక ఖరారు చేయకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. ఏటా మాదిరిగానే ఈ ఏడాది బ్యాంకులు రుణ వార్షిక ప్రణాళికను ఖరారు చేయాల్సి ఉన్నప్పటికీ.. ఇంకా చేయలేదు. ఫలితంగా అన్నదాతలు పెట్టుబడుల కోసం వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.

"సీజన్‌ను ముందుకు జరపాలని.. అంటే మార్చి నెలలోపే ఖరీఫ్ ప్రారంభించాలని ప్రభుత్వం చర్చిస్తోంది. సాగరాయకట్టు, ఇతర ప్రాజెక్ట్‌ల నీళ్లు ముందే వస్తే పంట సీజన్‌ ముందుకు జరిపి నవంబర్‌కు ముగించుకోవచ్చు. ఆ తరవాత రబీ డిసెంబర్​లో ప్రారంభిస్తే మార్చి నెలకు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవశాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చేటట్టు కృషి చేయాలి. ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి." - బాగం హేమంతరావు, రైతు సంఘం నాయకుడు, ఖమ్మం జిల్లా

"నాలుగు, ఐదో నెలల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున గింజల్లో ఉన్న తేమ శాతం ఆవిరి అయిపోయి.. కొనుగోలు చేసినప్పుడు మిల్లర్స్‌ ఆ పంటను వద్దనుకుంటారు. జూన్‌ 25 వరకు వెయ్యాల్సి వచ్చినప్పుడు మనం స్వల్పకాలిక పంటను వేస్తే సరిపోతుంది. నారుమడి వేసేందుకు అనుకూల పరిస్థితులు లేకపోతే.. వరి సాగు విధానం రెండు విధాలుగా చేసుకోవచ్చు. నారుమడిలో ఖర్చు అంతా తగ్గుతుంది. ఈ వరి విధానం మంచిది." - విజయనిర్మల, ఖమ్మం జిల్లా వ్యవసాయాధికారి

ఇవీ చదవండి:

Last Updated : Jun 18, 2023, 7:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.