అడవుల నుంచి బయటకు వచ్చే కోతులకు స్థానికులు నీటి సౌకర్యం కల్పించారు. ఖమ్మం జిల్లాలోని మణుగూరు-కొత్తగూడెం ప్రధాన రహదారిపై కోతులు సంచరిస్తుంటాయి. వేసవికాలంలో కోతులు తాగునీటికి ఇబ్బంది పడకుండా వాటి ప్రాణాలు నిలిపేందుకు స్థానికులు చిన్నపాటి నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ఆ నీటిని తాగి వానరాలు దాహం తీర్చుకుంటున్నాయి. ఇంకొందరు వాటికి ఆహారాన్ని కూడా అందిస్తున్నారు.
ఇవీ చూడండి: కరీంనగర్లో కవుల శోభాయాత్ర