ETV Bharat / state

'పెనుబల్లి అభివృద్ధికి రూ. కోటి కేటాయిస్తాం' - సత్తుపల్లి తాజా వార్తలు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్ నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పెనుబల్లి మండలాభివృద్ధి పనులకు ప్రభుత్వం త్వరలో కోటి రూపాయలు మంజూరు చేయనుందన్నారు.

mla says crore will be allocated for penuballi mandal development
'పెనుబల్లి అభివృద్ధికి రూ. కోటి కేటాయిస్తాం'
author img

By

Published : Dec 22, 2020, 1:55 PM IST

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలాభివృద్ధి పనులకు ప్రభుత్వం త్వరలో కోటి రూపాయలు మంజూరు చేయనుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మరికొన్ని గ్రామాల్లో ఇప్పటికే పూర్తైన పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్‌లను ప్రారంభించారు.

లంకపల్లి, ఏరు గట్ల గ్రామాలలో సిమెంటు రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్కినేని అలేఖ్య ,జడ్పీటీసీ సభ్యుడు మోహన్ రావు, ఏఎంసీ చైర్మన్ లక్ష్మణరావు, కనగాల వెంకటరావు పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: తరలి వచ్చిన జనం... నిరాశతో వెనుదిరిగిన వైనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.