ఏపీలోని సరిహద్దు ప్రాంతాల నుంచి మద్యం కోసం రాష్ట్రంలోకి రావడం వల్ల ఇక్కడ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపత్తి నియోజకవర్గంలో ఉన్న రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులను ఆయన పరిశీలించారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలను కొనియాడారు. వారికి వాటర్ బాటిల్స్, శానిటైజర్లు, మాస్కులు, పండ్లు అందించారు.
సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలంలోని వెంకటాపురం, పెనుబల్లి మండలం ముత్తగూడెం, సత్తుపల్లి మండలం మేడిశెట్టి వారిపాలెం పరిధిలో ఉన్న పోలీస్ చెక్ పోస్టులను ఆయన సందర్శించారు. లాక్డౌన్ అమలులో పోలీసుల కృషి ప్రధానమైనదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్, సీఐ కరుణాకరణ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పదో రోజు పకడ్బందీగా ఆంక్షలు.. ఉల్లంఘించిన వారిపై చర్యలు