ETV Bharat / state

'పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి'

author img

By

Published : Feb 28, 2020, 7:15 PM IST

పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొన్నప్పుడే పట్టణాలు పరిశుభ్రంగా మారుతాయని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. సత్తుపల్లిలోని పలు వార్డుల్లో పర్యటించిన ఆయన పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు.

mla-sandra-venkata veeraiah participated in pattana pragathi in sathupalli
'పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి'

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని పలు వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పర్యటించారు. ఈ సందర్భంగా 15వ వార్డులో ఇంటింటికీ తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 11 మంది లబ్ధిదారులకు రూ.17 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.

సత్తుపల్లి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే పని ఒక మున్సిపాలిటీ సిబ్బందిదే కాదని.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకున్నప్పుడే పట్టణం పరిశుభ్రంగా మారుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ హైమావతి, జడ్పీటీసీ సభ్యులు కూసంపూడి రామారావు, మున్సిపాలిటీ ఛైర్మన్ కూసంపూడి మహేశ్​, వైస్ ఛైర్​ పర్సన్ తోట సుజలా రాణి, పలువురు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.