ఖమ్మం జిల్లా తల్లాడలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. 15 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. నిరుపేదల వైద్యఖర్చులకు సీఎంఆర్ఎఫ్ ఎంతోగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తుందని చెప్పారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం చేయూతగా నిలిచిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల శేషగిరిరావు, అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై తీర్పు రేపటికి వాయిదా