ETV Bharat / state

గోదావరి జలాలతో సత్తుపల్లి సస్యశ్యామలం : ఎమ్మెల్యే సండ్ర - MLA Sandra Venkata Veeraiah Latest News

గోదావరి జలాలతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. జిల్లాలోని పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో కాలువ పూడికతీత పనులను కలెక్టర్​ కర్ణన్​తో కలిసి ఆయన పరిశీలించారు.

ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
author img

By

Published : Jun 20, 2020, 8:08 PM IST

ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టును బేతుపల్లి చెరువుకు అనుసంధానించామని... దీనివల్ల సత్తుపల్లిలో నీటి సమస్య తీరనుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఈ అనుసంధానం వల్ల సాగర్ కాల్వలకు, చెరువులకు, కుంటలకు గోదావరి జలాలు రానుండడం వల్ల సత్తుపల్లి సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. జిల్లాలోని పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో జరుగుతున్న 360 కిలోమీటర్ల కాలువ పూడికతీత పనులను కలెక్టర్​ కర్ణన్​తో కలిసి ఆయన పరిశీలించారు.

కలెక్టర్ సహకారంతో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి ప్రయోగాత్మకంగా 23 కిలోమీటర్ల మేర పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం అవడం వల్ల రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారన్నారు. సత్తుపల్లి మండలం నారాయణపురం పంట కాలువ, బేతుపల్లి చెరువు గట్టుపై హరితహారం కార్యక్రమం లో భాగంగా కలెక్టర్, ఎమ్మెల్యే మొక్కలు నాటారు.

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని, వ్యవసాయానికి అనుసంధానం చేసి కాలువ పూడికతీతలో సత్తుపల్లి నియోజకవర్గం తెలంగాణకే ఆదర్శంగా నిలిచిందని కలెక్టర్​ కర్ణన్​ తెలిపారు. ఉపాధి హామీ కింద జిల్లాలో 500 కిలోమీటర్లు పంట కాలువ పూడికతీత పనులు జరుగుతుండగా... ఒక్క సత్తుపల్లి నియోజకవర్గంలోనే 360 కిలోమీటర్ల పనులు జరగడం విశేషం అన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ నుంచి రక్షణగా మాస్కు తప్పనిసరిగా ధరించాలని కోరారు. రామ చంద్రరావు బంజర్, కొండ్రుపాడు, తుమ్మూరు గ్రామాల్లో ఉపాధి కూలీలతో కలెక్టర్ మాట్లాడారు.

ఇవీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్​ గన్​మెన్​కు కరోనా పాజిటివ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.