ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఏరుగట్లలో.. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజలతో మమేకమై ముందుకు వెళతామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధి కోసం రూ.70 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలులో కొంతమేర ఇబ్బందికర పరిస్థితులున్నమాట వాస్తవమేనన్నారు. తమ నియోజకవర్గంలో మాత్రమే.. మిల్లుల్లో పది వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా అనుమతులు తీసుకొచ్చామని వివరించారు.
కేంద్రం జాతీయ ఉపాధి హామీ నిధులు విడుదల చేయకపోవడంతో.. గ్రామాల్లో వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్లు, సిమెంట్ రహదారులను నిర్మించిన సర్పంచ్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ విజయ్, ఎంపీపీ అలేఖ్య, సర్పంచ్ శ్యామల, జడ్పీటీసీ సభ్యుడు మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: భాగ్యనగర రోడ్లకు మహర్దశ.. ప్రణాళికతో ముందుకెళ్తున్న ప్రభుత్వం..