రబీ సాగుకోసం వైరా జలాశయం కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే రాములు నాయక్ జలాశయం గేట్లు ఎత్తి నీటిని వదిలారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులతు అన్ని విధాలా అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులతో... గోదావరి జలాలను సాగునీటి వనరులుగా మార్చి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే చెందుతుందన్నారు. నీటిని పొదుపుగా వినియోగించి జలవనరులను కాపాడుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్టు