ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని వీఎం బంజర్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. బతుకమ్మ పండగ కీర్తిని ప్రపంచ నలుదిశలా తెలియజేయాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చీరల పంపిణీలో ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు తలెత్తడం వల్ల గత ఏడాది నుంచి కుల మతాలకు అతీతంగా ప్రతి మహిళకు ప్రభుత్వం నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తోందన్నారు.
ఇవీ చూడండి : ఒకే కార్డుపై ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్!