ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న గురుకులాలతో పాటు మరో ఐదు పాఠశాలలను ఈ ఏడాది ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: అమరవీరులకు కేసీఆర్ నివాళులు