ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తిమ్మారావుపేటలో రైతు వేదిక భవన నిర్మాణానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రికి స్థానిక సమస్యల గురించి ప్రజలు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.
అనంతరం రైతులు తమ భూముల సమస్యలను మంత్రి పువ్వాడ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన మంత్రి పువ్వాడ... ముఖ్యమంత్రితో చర్చించి అన్నదాతల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్‌రాజు, ఎమ్మెల్సీ బాలసాని, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కరోనా సంక్షోభంలో ల్యాప్‌టాప్ అమ్మకాల జోరు