రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోటపాడులో పర్యటించారు. గ్రామస్థులు ఊరు శివారులోనే వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం అందరూ ర్యాలీగా గ్రామ సభ వద్దకు వెళ్లారు.
అంతా బాగానే ఉన్నా మధ్యలో రోడ్డు పక్కనే ఉన్న చెత్తదిబ్బ మంత్రి కంట పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. చెత్తదిబ్బపై పట్టాకప్పి.. ప్రజాప్రతినిధుల కళ్లుగప్పారు. చెత్త దిబ్బకు సమీపంలో గ్రామానికి తాగునీరు సరఫరా చేసే గేట్‌వాల్వ్ చుట్టూ బ్లీచింగ్ చల్లిన అధికారులు.. అందులో చెత్త, కప్పలు, పురుగులున్నా పట్టించుకోకుండా వదిలేశారు. పల్లె ప్రగతి పనులు తూతూమంత్రంగా సాగుతున్నాయనేందుకు ఈ చిత్రాలే నిదర్శనం.
ఇవీచూడండి: పురపోరుకు ములుగు ఎందుకు దూరమైంది..?