ఖమ్మం జిల్లా అల్లిపురంలో రైతు వేదిక భవనానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని రైతులకు నేరుగా 14 వేల కోట్లు రూపాయలు పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం అందించడం అభినందనీయమన్నారు.
రైతును రాజు చేయాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్... అన్నదాతల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని మంత్రి వెల్లడించారు. అందులో భాగంగానే రైతులందరూ సంఘటితంగా చర్చించుకునేందుకు రైతు వేదిక భవనాలను నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్.వి కర్ణన్, ఎమ్మెల్సీ బాలసాని, జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, నగర మేయర్ పాపాలాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి.. రక్తనాళాలపై దుష్ప్రభావం