అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో పల్లె ప్రగతిపై నిర్వహించిన పంచాయతీరాజ్ సమ్మేళనంలో పాల్గొన్నారు.
మిషన్ భగీరథ, రైతుబంధు వంటి పథకాలను కేంద్రం అనుసరిస్తోందని మంత్రి తెలిపారు. తెలంగాణలోని పల్లెలన్నీ ప్రగతి పథంలో సాగుతున్నాయన్నారు. మూడో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభమయ్యేలోగా ఖమ్మం జిల్లాను... రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్ జడ్పీ ఛైర్మన్ కమల్ రాజు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి : ట్రంప్‌కు మురికివాడ కనిపించకుండా పెద్ద గోడ నిర్మాణం