సమాజంలో ఇంకా మానవత్వం బతికి ఉందని కరోనా సమయంలో నిరూపణ అయిందని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొవిడ్ నివారణకు 12 వేల లీటర్ల శానిటైజర్, మాస్కులు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌కు అందజేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి అజయ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ప్రజలు తమ దాతృత్వం చూపించాల్సిన సమయం వచ్చిందని అజయ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం తన వంతుగా నగదు, బియ్యం సాయం చేసిందని.. ఇంకా సమాజంలో ఉన్న వారు వితరణలు చేయాలని కోరారు. ముఖ్యంగా కరోనా నివారణ చర్యల్లో ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల రక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:టార్పాలిన్ల సరఫరాకు చేతులెత్తేసిన గుత్తేదారు.. టెండర్లు రద్దు