పైసలు పెట్టి పదవులు కొనుక్కున్న వారూ.. ముఖ్యమంత్రి కేసీఆర్(Minister Puvvada on Revanth) ను విమర్శిస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. అర్హత లేకున్నా అధ్యక్షులైన వారు ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల్లో అయితే కేంద్రమంత్రి అయినా జైల్లో వేసేవారని పేర్కొన్నారు. నవంబర్ 15న వరంగల్‌లో విజయగర్జన సభ ద్వారా గులాబీదళ సత్తా(Minister Puvvada on Revanth) చాటుతామని పేర్కొన్నారు. ఖమ్మంలో ఆయన పలు తెరాస ప్లీనరీ(ప్రజా ప్రతినిధుల సభ)లు, వరంగల్ సభ ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు. తెరాస ప్లీనరీలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు.
ప్రతిపక్ష నేతలు హుందాగా వ్యవహరించాలి. సీఎం కేసీఆర్‌పై హద్దులు మీరి మాట్లాడితే తెరాస కార్యకర్తల ఆగ్రహానికి గురి కాక తప్పదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటివి ఎన్నో చూశాం కాబట్టే రాష్ట్రం సాధ్యమైంది. ఇలాంటి సందర్భాల్లో మేము సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. వరంగల్ సభకు లక్షలాదిగా తరలి వెళ్లి తెరాస సత్తాను చాటుతాం.
-పువ్వాడ అజయ్ కుమార్, రవాణా శాఖ మంత్రి
తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటి ఆరోపణలు కేసీఆర్ ఎన్నో చూశారని పువ్వాడ(Minister Puvvada on Revanth) అన్నారు. వాటన్నిటినీ తట్టుకున్నారు కాబట్టే తెలంగాణ వచ్చిందని స్పష్టం చేశారు. కార్పొరేటర్ నుంచి ఏకంగా ఎంపీ పదవికి ఎదిగిన వారు, డబ్బులు పెట్టి పదవులు కొనుక్కున్న వారూ కేసీఆర్‌పై ఇష్టారీతిగా(Minister Puvvada on Revanth) మాట్లాడుతున్నారు. కానీ తాము సమన్వయం పాటిస్తున్నామని చెప్పారు. తెరాస సత్తా ఏమిటో, గులాబీ దళం కదిలితే ఎలా ఉంటుందో వరంగల్‌లో జరిగే తెలంగాణ విజయ గర్జన సభలో చూపిస్తామని పువ్వాడ(Minister Puvvada on Revanth) ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: huzurabad bypoll: ధరలు ఎప్పుడు తగ్గిస్తారో చెప్పి హుజూరాబాద్‌లో ఓట్లడగండి: హరీశ్‌రావు