ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. కూలీలు ఎంత ఎక్కువ పని చేస్తే అంతా డబ్బు వస్తుందని వెల్లడించారు.
మండలంలో 14 వేల జాబ్ కార్డులుంటే 6 వేల మంది మాత్రమే పని చేస్తున్నారని స్పష్టం చేశారు. అందరికీ పని కల్పించేలా గ్రామ సర్పంచులు చర్యలు తీసుకోవాలని సూచించారు.