Cath lab at Khammam Hospital: ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాథ్‌ల్యాబ్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. గాంధీ, నిమ్స్, ఉస్మానియా తర్వాత ఖమ్మంలోనే క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. పేదలకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకే క్యాథ్లాబ్ అందుబాటులోకి తెచ్చామన్నారు.
''రాష్ట్రంలో 4వ క్యాథ్‌ల్యాబ్‌ను ఖమ్మంలో ఏర్పాటు చేశాం. పేదలకు ఆధునిక వైద్య సేవల కోసమే క్యాథ్‌ల్యాబ్ అందుబాటులోకి తెచ్చాము. త్వరలోనే ఆదిలాబాద్‌లో కూడా క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేస్తాం. ఖమ్మంలో 100 పడకల ట్రామాకేర్ సెంటర్‌ను సైతం ప్రారంభించాం. క్షతగాత్రులకు తక్షణ వైద్యసేవలు అందేలా ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో రెండో మిల్క్ బ్యాంకును ఖమ్మంలో ప్రారంభించాం.
మధిర, సత్తుపల్లిలో రూ.34 కోట్ల చొప్పున 100 పడకల ఆస్పత్రుల ఏర్పాటు చేసి.. రేడియో, కీమోథెరపీ కేంద్రాలు అందుబాటులోకి తెస్తాం. రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లోని మార్చురీలను ఆధునీకరిస్తాం. ఖమ్మం మార్చురీని కూడా తీర్చిదిద్దుతాం.''
-హరీశ్ రావు, మంత్రి
తెలంగాణలో కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం బాగా పనిచేస్తోందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలో ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే నిర్వహించామన్నారు. 77 లక్షల ఇళ్లల్లో జ్వర సర్వే చేసి... 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామని వెల్లడించారు. 23 జిల్లాల్లో ఫీవర్ సర్వేను పూర్తి చేశామని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: TS Drugs Case: డ్రగ్స్ కేసులో రేపు టోనీని కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!