పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్చి 1న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటిస్తారని రాష్ట్ర రవాణా మంత్రి అజయ్‌కుమార్ తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఖమ్మం నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు. నగరంలో నిర్మించిన శాకాహార, మాంసాహార మార్కెట్లు, బాస్కెట్ బాల్ ఇండోర్ స్టేడియంను ప్రారంభిస్తారన్నారు.
నగరంలో అక్రమ నిర్మాణాలు, భూకబ్జాలపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెరాస కార్పొరేటర్లు భూకబ్జాలు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ఎవరిని క్షమించేది లేదని స్పష్టం చేశారు.
ఇవీచూడండి: పట్టణ ప్రగతి కార్యక్రమానికి కేటీఆర్ వస్తున్నారు: సత్తుపల్లి ఎమ్మెల్యే