.
ధాన్యం సేకరణకు ఇబ్బంది లేకుండా చూస్తాం: పువ్వాడ - minister ajay kumar latest news
ఖమ్మం జిల్లాలో వ్యవసాయ రంగంపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. రైతుల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన పండ్లు, కూరగాయలు పట్టణాలు, నగరాలకు తరలిస్తేనే అన్నదాతలకు ఉపయోగమన్నారు. నిత్యావసర వస్తువుల రవాణాకు ఆటంకం కలిగించొద్దని మంత్రి అజయ్ కుమార్ స్పష్టం చేశారు.
minister ajay kumar review latest news
.