ETV Bharat / state

కాగితాలపైనే ఖర్చు.... నిర్మాణానికి ముందే కరిగిపోతున్న నిధులు - ఖమ్మం జిల్లా తాజా వార్తలు

agricultural market: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌పై భారం తగ్గించడంతోపాటు రైతులకు మరిన్ని సేవలు అందించేందుకు ప్రభుత్వం మద్దులపల్లి వద్ద నూతన మార్కెట్‌ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు నిధులు సైతం విడుదల చేశారు. కానీ మార్కెట్ యార్డు నిర్మాణ పనులు ప్రారంభానికి ముందే.. అవకతవకలకు కేంద్ర బిందువుగా మారుతోంది. జంగిల్ కటింగ్, లెవలింగ్ పేరిట లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారంటూ ఏకంగా మార్కెటింగ్ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నిర్మాణం కోసం భూమి చదును చేసే పనుల పేరిట ఏకంగా లక్షల విలువైన మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలే ఈ పనులను చక్కబెట్టినట్లు తెలుస్తుండగా.. ఫిర్యాదులు చేసిన వారు అధికార పక్షం వారే కావడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.

వ్యవసాయ మార్కెట్​
వ్యవసాయ మార్కెట్​
author img

By

Published : Jun 26, 2022, 11:47 AM IST

Updated : Jun 28, 2022, 10:32 AM IST

వ్యవసాయ మార్కెట్ లోగుట్టు.. ఎందుకో నిధులకే ఎరుక

agricultural market: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, ఖమ్మం గ్రామీణం మండలాల రైతులకు మార్కెటింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు మద్దులపల్లిలో నూతన వ్యవసాయ మార్కెట్ ను నిర్మించేందుకు ప్రభుత్వం 2018 ఆగస్టులో పచ్చజెండా ఊపింది. మార్కెట్ నిర్మాణం కోసం తొలుత రూ.15 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు అంగీకారం తెలిపింది. పనులు దక్కించుకున్న గుత్తేదారు అంచనా విలువ పెంచాలని కోరగా ఇందుకు ప్రభుత్వం అంగీకరించి రూ.19.9 కోట్లు కేటాయించింది.

మద్దులపల్లిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమితో పాటు ఈ స్థలానికి ఆనుకుని ఉన్న రైతులకు చెందిన భూమిని సేకరించింది. ఇందుకు బదులుగా వారికి మరోచోట భూమి కేటాయించింది. మొత్తం 24.1ఎకరాల్లో మార్కెట్ యార్డు నిర్మాణానికి మంత్రి నిరంజన్ రెడ్డి 2022 మే 4న శంకుస్థాపన చేశారు. యార్డు నిర్మాణం, కంపౌండ్ వాల్, కార్యాలయ భవనం.. డ్రైయింగ్ ఫ్లాట్ ఫాంలు, మరుగుదొడ్లు తదితర పనులు చేపట్టేందుకు ప్రతిపాదన చేయగా వాటికీ ఆమోదం దక్కింది. ఇందుకు అవసరమైన నిధులు విడుదలయ్యాయి.

మార్కెట్ యార్డు నిర్మించాల్సిన స్థలం పూర్తిగా భారీ వృక్షాలు, చిన్న చిన్న గుట్టలతో నిండి ఉండేది. ఇప్పుడిదే గుత్తేదారుకు వరంగా మారింది. వాస్తవానికి టెండర్ దక్కించుకున్న గుత్తేదారు కాకుండా స్థానికంగా చక్రం తిప్పే అధికార పార్టీ నేతలే గుత్తేదారులుగా అవతారమెత్తి పనులు చేపట్టారు. ఇందులో భాగంగా జంగిల్ కటింగ్, లెవలింగ్ పేరిట భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ ప్రతిపాదనల్లో కొంతమేర మాత్రమే జంగిల్ కటింగ్, లెవలింగ్ కు నిధులు కేటాయించారు.

కానీ ఈ రెండు పనులకే గుత్తేదారు భారీగా ఖర్చు చేసినట్లు లెక్కలు చూపుతున్నట్లు తెలిసింది. యార్డు స్థలంలో కంపచెట్లు తొలగించడం చెట్లు నరికివేయడం, రహదారి నుంచి యార్డు వరకు మట్టితో రోడ్డు నిర్మాణం చేపట్టడం వంటి పనులు జరిగాయి. అంతేకాదు మార్కెట్ పనుల మాటున మట్టి దందా సాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థలంలో చిన్న గుట్టల నుంచి వందల కొద్దీ లారీల మట్టిని తరలించారు.

సుమారు 20 రోజుల పాటు రాత్రింబవళ్లు వందల లారీల ద్వారా మట్టిని తరలించి లక్షల విలువైన మట్టిని స్థిరాస్థి వ్యాపారులకు విక్రయించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా మట్టి తరలింపులో లక్షలకు లక్షలు గుత్తేదారు అవతారమెత్తిన అధికార పార్టీ నాయకులు జేబులో వేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా జంగిల్ కటింగ్, లెవలింగ్, మట్టి దందా పేరిటా సుమారు కోటి రూపాయల మార్కెట్ నిధుల్ని కాజేసేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మార్కెట్ నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే నిధులన్నీ కరిగిపోతున్నాయని స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పనుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని కొందరు ఏకంగా మార్కెటింగ్ శాఖకు ఫిర్యాదులు చేయడం గమనార్హం. మార్కెట్ కు ఖర్చు చేయాల్సిన నిధుల్లో.. సుమారు రూ.70 లక్షల మేర పనులు చేయకుండానే కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేశారు. మార్కెట్ పనుల మాటున మట్టి దందా జరుగుతుందని మైనింగ్, రెవెన్యూ, మార్కెటింగ్ శాఖ అధికారులకు కొంతమంది అధికార పార్టీకి చెందిన వారు స్వయంగా ఫిర్యాదు చేశారు. అయితే మార్కెటింగ్ శాఖ అధికారులు చెప్పే వాదన మాత్రం మరోలా ఉంది.

"మద్దులపల్లి నూతన వ్యవసాయ మార్కెట్ సంబంధించి గతంలో 2018లో రూ.15కోట్లతో అంచనా వేశారు. అవి సరిపోవనడంతో మరోసారి విలువ పెంచారు. ఈసంవత్సరంలో దానిని 19.9 కోట్లకు పెంచారు. వాటికి సంబంధించిన ఆదేశాలు రాగానే పనులను ప్రారంభిస్తాం." - నాగరాజు జిల్లా మార్కెటింగ్ అధికారి

ఇదీ చదవండి: హైదరాబాద్​లో 4 లక్షల 61 వేల కుక్కలు.. ఏ గల్లీలో చూసిన గుంపులు గుంపులే.

ఫడణవీస్​తో శిందే రహస్య భేటీ.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ!

కాగితాలపైనేఖర్చు.... నిర్మాణానికిముందే కరిగిపోతున్న నిధులు

Last Updated : Jun 28, 2022, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.