ఖమ్మంలో మకరజ్యోతి దర్శనం.. భక్తుల కోలాహలం - Telangana Latest news
సంక్రాంతి పర్వదినాన.. ఖమ్మం శ్రీ ధర్మ శాస్త అయ్యప్ప స్వామి ఆలయంలో శరణుఘోషతో మార్మోగింది. మకరజ్యోతి రూపంలో స్వామి.. భక్తులకు దర్శనమిచ్చారు. దేవాస్థానంపై కర్పూరం వెలిగించి జ్యోతి దర్శనం చేయించారు.

అయ్యప్ప స్వామి ఆలయంలో మకరజ్యోతి దర్శనం
ఖమ్మం శ్రీనివాస్ నగర్లోని శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో మకరజ్యోతి దర్శనం నిర్వహించారు. దేవస్థానంపై ఆలయ ప్రధాన అర్చకుడు నంబూద్రిపాద్ కర్పూరం వెలిగించి జ్యోతి దర్శనం చేయించారు.
శరణుఘోష..
భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి జ్యోతి దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా స్వామియే శరణమయ్యప్ప అనే శరణుఘోషతో మార్మోగింది.
భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయం కిక్కిరిసింది. మకరజ్యోతి దర్శనంతో పరవశించిపోయారు.
ఇదీ చూడండి: భక్తుల శరణుఘోష మధ్య మకరజ్యోతి దర్శనం