ETV Bharat / state

లాక్​డౌన్​ ఎఫెక్ట్​: చతికిల పడిన వ్యాయామం! - వ్యాయామశాలలపై లాక్​డౌన్​ ప్రభావం

పదుగురికి ఆరోగ్యాన్ని పంచడమే వృత్తిగా మలచుకున్నారు. అదే తమకు జీవనాధారం చేసుకున్నారు. కొత్త పోకడలకు అనుగుణంగా మరింత పెట్టుబడులు పెట్టి అధునాతన వ్యాయామశాలలుగా తీర్చిదిద్దుకున్నారు. లాక్‌డౌన్‌తో జిమ్‌లు మూసివేయడం వల్ల... ఓ వైపు ఉపాధి కోల్పోయి... కనీసం అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితి ఎదుర్కొంటున్న వ్యాయమశాలల నిర్వహకులపై ప్రత్యేక కథనం.

lock down on gyms in telangana
లాక్​డౌన్​ ఎఫెక్ట్​: వ్యాయామశాలలకు అనారోగ్యం!
author img

By

Published : Jun 6, 2020, 2:49 PM IST

నిత్యం వందల మందితో సందడి చేసే వ్యాయమశాలల్లో నిశ్శబ్ధం ఆవహించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని ఎప్పుడు తెరుస్తారో తెలియదు... ఉపాధి కోల్పోవడంతో నిర్వహకులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 37 జిమ్ములు ఉన్నాయి. ఒక్క ఖమ్మంలోనే 12 ఉన్నాయి. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా... జిమ్‌లకు ఆదరణ పెరిగింది.

మూడు నెలలుగా మూతపడ్డ జిమ్​లు

యువత ఎక్కువగా రావటం వల్ల ఇదే వృత్తి జీవనాధారంగా చాలా మంది ఔత్సాహికులు వ్యాయమశాలలు ఏర్పాటు చేసుకున్నారు. నూతన ఒరవడి తీసుకువస్తూ అత్యాధునిక పరికరాలు కోనుగోలు చేస్తే.. కరోనా రూపంలో పెను ప్రమాదం తీసుకొచ్చింది. మూడు నెలలుగా జిమ్‌లు మూత పడటంతో....అందులో పనిచేసే శిక్షకులకు, భవనం అద్దెలు చెల్లించడం కష్టంగా ఉందని వాపోతున్నారు.

ఖమ్మం నగరంలో జిమ్‌లు జీవనాధారంగా చేసుకుని వాటిపై ఆధారపడ్డవారు చాలామందే ఉన్నారు. ఆరోగ్య ప్రియులను ఆకర్షించేందుకు అధునాతన పరికరాలను కోనుగోలు జరిపారు. ప్రస్తుతం వాటిని ఉపయోగించకపోవడం వల్ల పరికరాలు తుప్పు పడుతున్నాయి.

అనుమతి ఇవ్వండి

ఆర్థికంగా ఇళ్లవద్ద కూడా అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూట గడవటం కష్టంగా ఉందంటున్నారు. కరోనా నివారణకు వ్యాయామం ఎంతో అవసరమని వైద్యులు చెబుతున్న తరణంలో పది మందికి ఆరోగ్యాన్ని పంచే వ్యాయామ శాలలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.

కరోనా నివారణ చర్యలు తీసుకుంటూనే జిమ్‌కు వచ్చే వారిని తక్కువ సంఖ్యలో అనుమతిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభుత్వం అన్నింటికి అనుమతి ఇచ్చినట్లే తమకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: నిధుల సమీకరణపై టాటా గ్రూప్ కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.